Jump to content

వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page WikiConference India 2023 and the translation is 60% complete.
Outdated translations are marked like this.

28 – 30 April, 2023
Hyderabad, India


Home Translation Buddy Pre-Conference Program Connect Team Friendly Space Policy FAQs

"వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023" అనేది ఒక జాతీయ స్థాయి సమావేశం, ఇది భారతదేశం ఇంకా కొన్ని దక్షిణాసియా ప్రాంతాలలో ఉద్యమానికి సంబంధించిన భారతీయ-భాషా వికీమీడియా ప్రాజెక్టులు మరియు ఇతర అంశాలపై ఆసక్తి ఉన్న వికీమీడియన్లు మరియు వాటాదారులకు ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది. ఇది ఒక ప్రాంతంగా భవిష్యత్తు వ్యూహాన్ని చర్చించడానికి, కలపటానికి ఇంకా పంచుకోవడానికి, కథలు, అభ్యాసాలు, ఉత్తమ అభ్యాసాలు మరియు సవాళ్లను చర్చించడానికి ఒక స్థలం. ఈ సదస్సు 28‒30 ఏప్రిల్ 2023 న హైదరాబాద్ లో జరగనుంది.

WCI 2023 నేపథ్యం

ఈ వికీకాన్ఫరెన్స్ ఇండియా పునరావృత నేపథ్యం బంధాలను బలోపేతం చేయడం. ఈ కాన్ఫరెన్స్ కొన్ని దక్షిణాసియా ప్రాంతాల్లోని సంఘాల సభ్యుల మధ్య తిరిగి సంబంధం కలిగి ఉండటానికి, వారి ఆలోచనలు లేదా అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఇంకా వారి సముదాయ అభివృద్ధికి సహకరించడానికి ఒక అవకాశంగా ఉంటుంది.

నేపథ్యం మరియు ప్రయోజనం

వికీకాన్ఫరెన్స్ భారతదేశం మొదట ముంబైలో 2011లో నిర్వహించబడింది ఆతర్వాత మళ్లీ చండీగఢ్‌లో 2016 నిర్వహించబడింది. మూడవ సదస్సు 2020లో జరగాలని అనుకున్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా దానిని రద్దు చేయాల్సి వచ్చింది.

2023 సదస్సు భారతదేశం లో వికీమీడియా సముదాయ సభ్యులను మరియు దక్షిణాసియా ప్రాంతం నుండి ఇతర సముదాయ సభ్యులను తీసుకురావడానికి, విలక్షణ సముదాయాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఇంకా జ్ఞానం మరియు అనుభవాన్ని మార్పిడి చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 యొక్క విస్తృత లక్ష్యాలు:

  • వికీమీడియా వినియోగదారులు, ప్రాజెక్టులు, సంఘాలు, అనుబంధ సంస్థలు మరియు ఈ ప్రాంతంలోని భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం మరియు మద్దతు ఇవ్వడం.
  • పాల్గొనేవారి మధ్య జ్ఞానం, అనుభవం మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి మద్దతు ఇవ్వడం మరియు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, నిరంతర సమస్యలను చర్చించడానికి మరియు ఒకరి పనిని మరొకరు ఆదరించడానికి ఒక స్థలాన్ని అందించడానికి.
  • అనుభవజ్ఞులైన వికీమీడియన్లు, స్థాపించబడిన సమితులు మరియు అనుబంధ సంస్థలతో అనుసంధానించడం ద్వారా చిన్న సంఘాల పెరుగుదలకు మద్దతు ఇవ్వడం.
  • గత నాలుగు సంవత్సరాలలో వివిధ సంఘ సభ్యులు ప్రాజెక్ట్‌లు, ప్రచారాలు, ఈవెంట్‌లు మొదలైనవాటిని కలిగి ఉన్న వివిధ కార్యకలాపాల నుండి నేర్చుకున్న వాటిని తరువాత ఉపయోగం కోసం డాక్యుమెంట్ చేయడానికి.
  • రాబోయే కొన్నేళ్లపాటు భారతదేశం లో ఉద్యమాన్ని ఏ విధంగా రూపుదిద్దుకోవచ్చో, దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి ఎలా దోహదపడవచ్చో వ్యూహరచన చేయాలి.

కాలక్రమం

  • సదస్సులో పాల్గొనడానికి సెషన్లు మరియు స్కాలర్షిప్ దరఖాస్తులకు పిలుపు 11 నవంబర్ 2022, 00:00 గంటలకు ప్రారంభమవుతుంది.
  • మీ సెషన్ మరియు స్కాలర్‌షిప్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 27 నవంబర్ 2022, 23:59 IST నుండి 14 డిసెంబర్ 2022, 23:59 IST వరకు పొడిగించబడింది.
  • స్కాలర్‌షిప్‌లపై మరింత సమాచారం కోసం, దయచేసి పాల్గొనడం ట్యాబ్‌ని సందర్శించండి.
  • మీ సెషన్ ప్రతిపాదనను సమర్పించడానికి, దయచేసి సెషన్ సమర్పణలు ట్యాబ్‌ని తనిఖీ చేయండి.

స్థానం మరియు ఈవెంట్ తేదీలు

  • స్థానం: హైదరాబాద్, తెలంగాణ
  • తేదీ:' 28‒30 ఏప్రిల్ 2023