Grants:Project/Creating Online training resources for Telugu Wikipedia/Midpoint
This project is funded by a Project Grant
proposal | midpoint report |
- Report accepted
- To read the approved grant submission describing the plan for this project, please visit Grants:Project/Creating Online training resources for Telugu Wikipedia.
- You may still review or add to the discussion about this report on its talk page.
- You are welcome to email projectgrantswikimedia.org at any time if you have questions or concerns about this report.
Welcome to this project's midpoint report! This report shares progress and learning from the first half of the grant period.
Summary
[edit]In a few short sentences or bullet points, give the main highlights of what happened with your project so far.
- తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు (100 పేజీలు), విధానాలు - మార్గదర్శకాల పేజీలను (78 పేజీలు) వాటి స్థాయి (సమాచారం అనువాద స్థాయి, కొత్తవారికి మార్గదర్శకం) ఆధారంగా పేజీల సూచిక పేజీ తయారీ
- ఆయా వ్యాసాలలో సమాచారం, అనువాద శాతం, కొత్త వాడుకరులకు మార్గదర్శకం, పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను పరిశీలన
- వికీపీడియా శిక్షణ కోసం రూపొందించిన వీడియోలు (కామన్స్ లో, యూట్యూబ్ లో) చూసి, అందులోని కంటెట్, శిక్షణ విధానం, స్క్రీన్ రికార్డింగ్ పద్ధతులు, వీడియో మేకింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది.
- వికీ రచనలో ఉన్న సందేహాలు, రచనా పద్ధతుల గురించి కొత్త వాడుకరులతో చర్చ
- సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలలోని సమాచారం ఆధారంగా పాఠ్యాంశాలు, ప్రశ్నావళిని తయారీ
- తయారుచేసిన పాఠ్యాంశాలను, ప్రశ్నావళిని సముదాయ సభ్యుల, ప్రాజెక్టు కమిటీ సూచనలమేరకు వర్గం(బోధన, శిక్షణ)- స్థాయి (ప్రాథమిక, మధ్యమ, ఉన్నత) - స్థితి (కంటెంట్, వీడియో తయారీ, ప్రయోగం) అనే మూడు భాగాలతో ఒక టేబుల్ ఫార్మాట్ తయారీ.
- వికీపీడియా పరిచయం, వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, వికీపీడియా వ్యాస వివరాల పరిచయం, ఇన్ పుట్ టూల్స్ పరిచయం, వికీ ఖాతాను తెరవడం, వాడుకరి చర్చాపేజీ, ప్రయోగశాల, వీక్షణ జాబితా మొదలైన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలతో వీడియోలకు కావలసిన కంటెంట్ తయారీ.
- పాఠాలకు సంబంధించి ప్రయోగ స్క్రీన్ రికార్డింగ్, వీడియోల తయారీ
Methods and activities
[edit]How have you setup your project, and what work has been completed so far?
Describe how you've setup your experiment or pilot, sharing your key focuses so far and including links to any background research or past learning that has guided your decisions. List and describe the activities you've undertaken as part of your project to this point.
- తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా ముందుగా తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలను వాటి స్థాయి (సమాచారం అనువాద స్థాయి, కొత్తవారికి మార్గదర్శకం)న ఆధారంగా ఒక జాబితాలు తయారుచేయాలని ప్రాజెక్టు కమిటి సూచించింది. ఆ సూచనతో తెవికీలో ప్రధానంగా ఉన్న 90 సహాయం పేజీల జాబితాతో సహాయం పేజీల సూచిక, 78 విధానాలు - మార్గదర్శకాల పేజీల జాబితాతో విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచిక పేజీని తయారు చేశాము.
- ఆయా వ్యాసాలలో సమాచారం ఎలా ఉంది, ఎంతశాతం అనువాదం అయింది, సమాచారం కొత్త వాడుకరులకు మార్గదర్శకంగా ఉందా లేదా, ఆయా పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను పరిశీలించడం జరిగింది. అలాగే పేజీల సూచికల తయారీ గురించి తెలుగు వికీపీడియా రచ్చబండలో రాసి, వికీ సభ్యులు ఆయా పేజీలను చూసి తగు సూచనలు చేయాలని కోరి, వారి సూచనలు అనుసరించి సూచికల పేజీల్లో మార్పులు చేయడం జరిగింది.
- స్వాగతం పేజీ మొదలైన వాటిద్వారా ఈ సహాయం పేజీలను కొత్త వాడుకరులకు పరిచయం చేస్తే, వారు వికీ రచనలో మెళకువల గురించి స్వయంగా నేర్చుకోగలుగుతారన్న అభిప్రాయంతో ఈ సహాయం పేజీల సూచిక, విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచికల గురించి తెవికీ రచ్చబండలో సహ సభ్యులుకు తెలియపరుస్తూ, ఈ సహాయం పేజీల సూచికను, సహాయం పేజీలను పరిశీలించి తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరాము. సహాయం పేజీల సూచిక, విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచిక ను పరిశీలించిన చదువరి గారు కొన్ని సహాయం పేజీల్లో సవరణలు చేశారు. ఆ సవరణలను అనుసరించి సూచికల పేజీల్లో మార్పులు చేసాను. సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీల్లో చేయాల్సిన పని గురించి సూచికల పేజీలకు సంబంధించిన చర్చ పేజీల్లో (సహాయం పేజీల సూచిక చర్చాపేజీ, విధానాలు మార్గదర్శకాల పేజీల సూచిక చర్చాపేజీ) చదువరి గారు కొన్ని సూచనలు చేశారు.
- ఐఐఐటీలో జరుగుతున్న వికీ ఇండిక్ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాల గురించి, కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి వారు అవలంబిస్తున్న విధానాలను, వారి అనుభవాలను తెలుసుకోవడానికి ఐఐఐటీకి వెళ్ళాను. కొత్తవారు వికీపీడియా రచన సులువుగా నేర్చుకోవడంకోసం తెలుగు వికీపీడియా పరిచయంతో మొదలై బేసిక్ ఎడిటింగ్ వరకు 15 ట్రైనింగ్ పాఠాలు తయారు చేశారు. వాటిని పరిశీలించాను. అలాగే, ఐఐఐటి వారి వికీ ఇండిక్ ప్రాజెక్టు కోసం రూపొందించిన ఐఐఐటి ప్రయోగశాలలో జరుగుతున్న వ్యాసరచన, వ్యాసాల దిద్దుబాట్లు చూశాను.
- వికీపీడియా శిక్షణకు సంబంధించి పాఠ్యాంశాల జాబితా, వాటికి తగిన ప్రశ్నావళిని రూపొందించాము. https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ_పాఠ్య_ప్రణాళిక/పాఠ్యాంశాలు
- పాఠ్యాంశాల జాబితా, వాటికి తగిన ప్రశ్నావళిని గురించి వికీపీడియా రచ్చబండలో రాసి సముదాయ సభ్యుల అభిప్రాయాలను కోరాము.
- వికీపీడియా శిక్షణకు సంబంధించి 8 పాఠాలతో 1. వికీపీడియా పరిచయం, 2. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, 3. వ్యాస వివరాల పరిచయం, 4. ఖాతాను తెరవడం, 5. వాడుకరి పేజీని సృష్టి, 6. వాడుకరి చర్చాపేజీ, 7. ప్రయోగశాల, 8. వీక్షణ జాబితా పేజీలు సృష్టించడం తయారుచేసి, సముదాయ సభ్యులు ఈ పేజీలను పరిశీలించి తమ సలహాలు, సూచనలు, మార్పులు తెలియజేయాలని రచ్చబండలో కోరాము.
Midpoint outcomes
[edit]What are the results of your project or any experiments you’ve worked on so far?
Please discuss anything you have created or changed (organized, built, grown, etc) as a result of your project to date.
- వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు మార్గదర్శకాల పేజీలను గుర్తించి, వాటన్నింటిని ఒకేచోటకి చేర్చడం జరిగింది. ఈ జాబితా ద్వారా ఆయా పేజీలన్నింటిని అన్నిఒకచోట చేర్చడమేకాకుండా, ఆయా వ్యాసాలలో సమాచారం ఎలా ఉంది, ఎంతశాతం అనువాదం అయింది, సమాచారం కొత్త వాడుకరులకు మార్గదర్శకంగా ఉందా లేదా, ఆయా పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను కూడా పేర్కొనడం జరిగింది.
- కొత్త వాడుకరులతో వికీ రచన గురించి చర్చలు జరిపి, వారికి అనుగుణమైన అంశాలను పరిశీలించి వాటి ఆధారంగా తెలుగు వికీ శిక్షణకు కావలసిన పాఠ్యాంశాల జాబితా, ప్రశ్నావళిని తయారుచేయడం జరిగింది.
- ప్రశ్నావళి ఆధారంగా పాఠ్యాన్ని, పాఠ్యం ఆధారంగా వీడియోని తయారుచేయడం.
- దాదాపు 10 టాపిక్ లకు సంబంధించి పాఠాలను రాయడం జరిగింది. చదువుకోని, వికీలో దిద్దబాట్లు చేయడానికి ఆయా పాఠాలు వీలుగా ఉన్నాయి. వాటిని వీడియోలుగా తయారుచేయడానికి ఒక్కో వీడియోకు స్టోరి బోర్డను కూడా తయారుచేస్తున్నాం.
- అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎక్కిడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అందుచేత వీడియోలకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు.
Finances
[edit]Please take some time to update the table in your project finances page. Check that you’ve listed all approved and actual expenditures as instructed. If there are differences between the planned and actual use of funds, please use the column provided there to explain them.
Then, answer the following question here: Have you spent your funds according to plan so far? Please briefly describe any major changes to budget or expenditures that you anticipate for the second half of your project.
- Remuneration of Project Coordinator: Rs. 2,10,000/- (Rs.35,000/month/6 months, July to December 2021)
- Laptop: Rs. 56,000/-
- WD 2TB Elements Portable External Hard Drive: Rs. 5,249/-
- Oneplus Wireless Ear Earphones: Rs. 1999/-
- Total = Rs. 2,73,248/-
- Grant 1st Instalment = 4,63,348
- Balance = 1,90,100/-
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎక్కిడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అందుచేత వీడియోలకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి, ప్రస్తుతానికి ప్రాజెక్టు కో అర్డినేటర్ నెలవారి జీతం (35 వేలు*6 నెలలు), లాప్ టాప్, హర్డ్ డిస్క్, హియర్ ఫోన్స్ లకు సంబంధించి మాత్రమే గ్రాంట్ ను డబ్బును ఉపయోగించాము. మిగిలిన డబ్బు అలాగే ఉంది. ఎక్విప్ మెంట్ కొనడానికి గ్రాంట్ లో మొదట్లో రూ. 60,000 కేటాయించాము. కానీ, ఆ బడ్జెట్ లో అనుకున్న ఎక్విప్ మెంట్ రాలేదు. అందుకోసం రూ. 63,248 ఖర్చుచేయాల్సివచ్చింది.
Learning
[edit]The best thing about trying something new is that you learn from it. We want to follow in your footsteps and learn along with you, and we want to know that you are taking enough risks to learn something really interesting! Please use the below sections to describe what is working and what you plan to change for the second half of your project.
- వికీపీడియా శిక్షణకు సంబంధించి ఒక వీడియోను తయారుచేయడానికి ముందు ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలో నేర్చుకున్నాం. ఇందులో వీడియో పాఠ్యానికి టాపిక్ ఎంపిక, ఆ టాపిక్ కు సంబంధించి కొత్త వాడుకరులతో చర్చలు జరపడం, వారికి అనుకూలమైన ప్రశ్నావళి, పాఠ్యాన్ని తయారుచేయడం వంటివి ముఖ్యమైన ఘట్టాలు.
- వికీలో దిద్దుబాట్లు చేయడంకోసం కొత్తవారికి ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నప్పడు గతంలో మనం దిద్దుబాట్లు చేసిన అనుభవంతో వారికి దగ్గరుండి అన్నీ నేర్పించవచ్చు. కానీ, పాఠాలను తయారుచేయడం అనేది కాస్త శ్రమతో కూడుకున్న పనే. అందునా పాఠ్య ప్రణాళిక ప్రకారం (తొలి నుండి తుది వరకు) పాఠాలు రూపొందించడమనేది పెద్ద ప్రయత్నం, కృషి అవసరమైన పనే అని చెప్పవచ్చు.
- అందుకోసం మేం తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు (100 పేజీలు), విధానాలు - మార్గదర్శకాల పేజీలను (78 పేజీలు) వాటి స్థాయి (సమాచారం అనువాద స్థాయి, కొత్తవారికి మార్గదర్శకం) ఆధారంగా పేజీల సూచిక పేజీ తయారు చేసుకున్నాం. వాటి ఆధారంగా తెలుగు వికీపీడియా శిక్షణకు కావలసిన పాఠ్యాంశాల జాబితా, ప్రశ్నావళిని తయారుచేసుకొని, ప్రశ్నావళి ఆధారంగా పాఠ్యాన్ని రాసుకున్నాం.
ప్రాజెక్టు రెండవ భాగం
- రాసుకున్న పాఠ్యానికి స్టోరీబోర్డును తయారుచేసి దాని ఆధారంగా వీడియోలను రూపొందిస్తాము.
- 50-70 అంశాల వరకు బోధనోపకరణాలు తయారుచేసి, కొత్త వాడుకరులకు శిక్షణ ఇవ్వడంలో వాటిని ఉపయోగించి, వాటి సామార్థ్యాన్ని పరీక్షిస్తాము.
- ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక మెథడాలజీని రూపొందించి, దానిని ఇతర భాషా వికీపీడియన్లకు చూపిస్తాము.
What are the challenges
[edit]What challenges or obstacles have you encountered? What will you do differently going forward? Please list these as short bullet points.
- వికీపీడియా శిక్షణకు కావలసిన బోధనోపకరణాలను తయారుచేయడంలో భాగంగా మొదట్లో ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియలేదు. చాలాకాలం తర్జనభర్జనల తరువాత, అసలు తెలుగు వికీపీడియా శిక్షణకు సంబంధించి వికీలో ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకునేందుకు ఒక జాబితాను రూపొందించాలనుకున్నాం.
- శిక్షణకు సంబంధించి వికీలో సమాచారం అంతా ఒకేచోట కాకుండా వివిధ భాగాలలో ఉంది. సహాయం పేజీలు, విధానాలు మార్గదర్శకాల పేజీలలో సమాచారాన్ని చదివి వాటిని జాబితా చేయడానికి నెలరోజుల సమయం పట్టింది. ఆ జాబితా ద్వారా ఆయా పేజీలన్నింటిని అన్నిఒకచోట చేర్చడమేకాకుండా, ఆయా వ్యాసాలలో సమాచారం ఎలా ఉంది, ఎంతశాతం అనువాదం అయింది, సమాచారం కొత్త వాడుకరులకు మార్గదర్శకంగా ఉందా లేదా, ఆయా పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను కూడా పేర్కొనడం జరిగింది.
- కొన్ని పేజీలలో ఉన్న సమాచారానికి కాలదోషం పట్టింది. అటువంటి పేజీలను గుర్తించి జాబితాలో చేర్చడమైనది.
- టాపిక్ ఎంపిక, ప్రశ్నావళి, పాఠ్యం తయారీ విషయంలో అనుభమున్న వాడుకరి లాగా కాకుండా, కొత్త వాడకరిలా ఉండాలి. ఆ తేడాను గ్రహించి, కొత్త వాడుకరుతో ఆయా విషయాలపై చర్చలు జరిపి వారికి సులభంగా అర్థమయ్యేవిధంగా పాఠాలను తయారుచేశాము.
What is working well
[edit]What have you found works best so far? To help spread successful strategies so that they can be of use to others in the movement, rather than writing lots of text here, we'd like you to share your finding in the form of a link to a learning pattern.
- తెలుగు వికీపీడియాలోని 100 సహాయం పేజీలు, 78 విధానాలు - మార్గదర్శకాల పేజీలను సూచిక పేజీ తయారు చేసి, వాటి ఆధారంగా తెలుగు వికీపీడియా శిక్షణకు కావలసిన పాఠ్యాంశాల జాబితా (టాపిక్స్), ప్రశ్నావళిని తయారుచేసుకొని, ప్రశ్నావళి ఆధారంగా పాఠ్యాన్ని రాసుకున్నాం.
- తెలుగు వికీపీడియా సముదాయ సభ్యుడు, నిర్వాహకుడైన చదువరి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉపయెగకరమైన సలహాలు, సూచనలు అందజేశారు. అలాగే ఇతర సముదాయ సభ్యులు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడానికి ఆసక్తి చూపుతున్నారు.
Your learning pattern link goes here
- తెలుగు వికీపీడియా సహాయం పేజీల సూచిక
- తెలుగు వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల పేజీల సూచిక
- తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాలు
- తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలు
Next steps and opportunities
[edit]What are the next steps and opportunities you’ll be focusing on for the second half of your project? Please list these as short bullet points.
- తెలుగు వికీపీడియా గురించి తెలుగులో డాక్యుమెంట్లు/వికీపీడియా పేజీలు/వీడియోలు/ఆడియోలు మొదలైనవి 50-70 అంశాల వరకు బోధనోపకరణాలు తయారుచేసి, కొత్త వాడుకరులకు వికీపీడియాకు సంబంధించిన వివిధ అంశాల గురించి శిక్షణ ఇవ్వడంలో వాటిని ఉపయోగించడం.
- తయారు చేసిన బోధనోపకరణాలు ఉపయోగించి 100+ కొత్త వికీపీడియన్లు, 20+ సముదాయ వికీపీడియన్లకు శిక్షణ ఇవ్వడం, బోధనోపకరణాల సామర్థ్యాన్ని అంచనా వేయడం.
- ఇతర భాషా వికీపీడియన్లు ఈ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, వారి భాషలో ఈ ప్రాజెక్ట్ ప్లాన్‌ను స్వీకరించాలనుకుంటే వారికి మద్దతు ఇవ్వడానికి సహాయపడే ఒక వర్క్‌షాప్‌ని నిర్వహించడం.
- ప్రతి బోధనోపకరణం/పాఠ్యం ప్రాథమిక రివిజన్, ఫీడ్‌బ్యాక్ రివిజన్, ఫైనల్ రివిజన్ ద్వారా నిర్థారించడం
Grantee reflection
[edit]We’d love to hear any thoughts you have on how the experience of being an grantee has been so far. What is one thing that surprised you, or that you particularly enjoyed from the past 3 months?
- తెలుగు వికీపీడియా శిక్షణకు కావలసిన పాఠ్యప్రణాళికను రూపొందించడాని కొత్త వాడుకరులకు సహాయంకోసం తెలుగు వికీపీడియాలో ఇదివరకే ఉన్న పేజీలను పరిశీలించడం వల్ల, తెలుగు వికీపీడియాపై మరికొంత అవగాహన వచ్చింది. వికీ రచనలో ఉన్న కొత్త అంశాలను నేర్చుకున్నాను.
- పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో అనుభవం వచ్చింది.
- ఒక్కొక్క పాఠ్యాంశాన్ని తీసుకొని పాఠ్యాన్ని తయారుచేసిన తరువాత, ఆ పాఠ్యం అధారంగా వీడియోలు తయారుచేస్తున్నక్రమంలో వీడియోల కోసం వేరే పాఠ్యం అవసరమౌతుందని అర్థమయింది. వాడుకరులు చదివి తెలుసుకునేందుకు వీలుగా ముందుగా ఒక పాఠ్య ప్రణాళికను రాసుకొని, ఆ తరువాత ఈ పాఠ్య ప్రణాళికను వీడియో తయారీకి సరిపోయేవిధంగా స్టోరీబోర్డును ఉపయోగించి మళ్ళీ రాసుకోవాలి.