Wikimedia Foundation elections/2021/2021-09-01/2021 Voting Closes/te
వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఓటింగ్ 31 ఆగష్టు 23:59 (UTC) గంటలకు ముగిసింది. ఓట్లను లెక్కించిన తరువాత ఎన్నికల సమితి వారు గెలుపొందిన అభ్యర్దులని మరియు ఓట్ల గురించి ఏకీకృత సమాచారాన్ని ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులను బోర్డు నిర్ధారించిన తరువాత కొత్త ట్రస్టీల అధికారిక ప్రకటన జరుగుతుంది.
216 వికీ ప్రాజెక్టులు నుండి 6946 వికీమీడియన్లు ఓటు వేశారు. ఇది మొత్తంలో 10.2% శాతం, మరియు 2017 ఎన్నికల కంటే 1.1 శాతం ఎక్కువ. 2017 లో, 202 వికీ ప్రాజెక్టులు నుండి 5167 వికీమీడియన్లు ఓటు వేశారు. ధృవీకరించబడిన ఫలితాలు ప్రకటించబడిన తరువాత ఎన్నికల గురించి పూర్తి విశ్లేషణన ప్రచురింపబడుతుంది. ఈలోగా, మీరు ఎన్నికల సమయంలో విడుదల చేయబడ్డ డేటాను ఈ పేజీలో చూడవచ్చు.
ఈ ఎన్నికలకు వైవిధ్యం ఒక ముఖ్యమైన లక్ష్యం. బోర్డు ఎన్నికలకు సంబంధించిన సందేశాలు 61 భాషల్లోకి అనువదించబడ్డాయి. 70 సముదాయాల నుండి వికీమీడియన్లు మొదటి సారి ఎన్నికలలో ఓటు వేశారు. మీ సహాయంతో, వచ్చే సంవత్సరం ఎన్నికలను మరింత మెరుగ్గా నడపాలని ఆశిస్తున్నాము.