వికీపీడియా గ్రంథాలయం

వికీపీడియా గ్రంథాలయం అనేది ఒక సార్వజనిక పరిశోధనా నెలవు. వికీపీడియాలోని వ్యాసాలను మరింత అర్ధవంతంగా, విషయపరిపుష్టంగా, మూలాలను చేర్చేందుకు నమ్మదగిన వనరులను చురుకైన వికీపీడియా వాడుకరులకు అందిస్తుంది. వికీపీడియా గ్రంథాలయం ప్రాజెక్టు ద్వారా వికీపీడియా వాడుకరులకు జేస్టర్, ఎల్స్‌వియర్ లాంటి ఖర్చుతో కూడుకుని ఉన్న వనరులను వికీపీడియా వాడుకరులు ఉచితంగా, సులువుగా, సమిష్టిగా, సమర్ధవంతంగా వాడుకోగలరు. ఈ విధంగా వికీపీడియా వాడుకరులకు వారి దిద్దుబాటు పనిలో సహకారం అందుతుంది.
వికీమీడియా గ్రంథాలయం ప్రాజెక్టును నడిపే వికీమీడియా ఫౌండేషన్ జట్టు వారు డజన్ల కొద్దీ (రుసుముతో వనరులను ప్రచురించే) ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకుని ఆయా వనరులను అర్హులైన వికీమీడియా వాడుకరులకు అందిస్తున్నారు.
మమ్మల్ని సంప్రదించే విధానాలు
ఈమెయిల్: wikipedialibrary
wikimedia
org •
ట్విట్టర్: @wikilibrary •
ఫేస్బుక్(మెటా): The Wikipedia Library •
మెయిలింగ్ లిస్ట్: Wikipedia-Library •
మేం ఏం చేస్తాము
డేటాబేస్ అందుబాటు: వికీపీడియా వాడుకరులకు డబ్బుతో కూడుకున్న వనరులను ఉచితంగా అందించడం కోసం ఫ్రీ ఆక్సెస్ విరాళాలను ఏర్పాటు చేయడం.
మీరు ఎలా పాల్గొనగలరు
అనువాదం: లైబ్రెరీ కార్డ్ వేదికను మీ భాష మాట్లాడే వికీపీడియన్ల కోసం మీరు అనువాదం చేయవచ్చు.
సమన్వయకర్త అవండి: గ్రంఠాలయ నిర్వహణలో సహకరించి గ్రంథాలయాన్ని మెరుగుపరచండి.
సాంకేతిక ప్రాజెక్టులలో మాకు సహాయం చేయండి: సాంకేతిక పనిముట్లను, వనరులను, పనులను, మార్పులను పూరించి వికీమీడియా ప్రాజెక్టులలో పరిశోధనను మెరుగుపరచటంలో సహాయం చేయండి.
న్యూస్‌లెటర్ చదవండి: మా జట్టు చేసిన పనులను, ప్రస్తుతం చేస్తున్న పనులను గురించి చదివి, మా స్థితిగతులపై తాజా సమాచారం పొందండి.
అరబిక్ • బంగ్లా • కాటలాన్ • జర్మన్ • గ్రీక్ • ఇంగ్లీష్ • స్పానిష్ • పర్షియన్ • ఫిన్నిష్ • ఫ్రెంచ్ • హిందీ • హిబ్రూ • కుర్దిష్ • ఇటాలియన్ • డచ్ • నార్వేజియన్ • పోలిష్ • పోర్చుగీస్ • రష్యన్ • Simple English • సింధీ • స్వీడిష్ • టర్కిష్ • ఉక్రెయినియన్ • వియత్నామీస్ • యోరుబా • చైనీస్