File:Chenchu tribe.jpg
Original file (2,441 × 2,441 pixels, file size: 1.28 MB, MIME type: image/jpeg)
This is a file from the Wikimedia Commons. The description on its description page there is copied below.
Summary
DescriptionChenchu tribe.jpg |
The Chenchus are referred to as one of the Primitive Tribal Groups that are still dependent on forests and do not cultivate land but hunt for a living. Non-tribe people living among them rent land from the Chenchus and pay a portion of the harvest చెంచులు-జీవన విధానం: ఆంధ్రదేశంలోని అరుదైన గిరిజన తెగలలో చెంచులు ఒకరు.వీరు నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు,నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాలలో వ్యాపించి ఉంటారు. చెంచుల వర్గీకరణ: చెంచులను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు.అవి 1.అడవి చెంచులు. 2.దేవ చెంచులు. 3.బొంత చెంచులు. 4.కృష్ణ చెంచులు.
ఒక్కొక్క గోత్రంకు చెందిన చెంచులు తేనె తీసుకునేందుకు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించుకుని రాత్రి పూటల్లో తేనె ను సేకరిస్తారు.తేనె సేకరించడానికి వెళ్ళినపుడు బావామరదుల్ల్ని వెంట తీసుకువెళతారు.అన్నదమ్ములను మాత్రం తీసుకువెళ్ళరు.ఎందుకంటే వీరిలో అన్న చనిపోయినపుడు అతని భార్యను తమ్ముడు వివాహం చేసుకునే ఆచారం ఉంది.ప్రతీ గూడెంకు ఒక హద్దు ఉంటుంది. ఒక గూడెంకు ఉన్న హద్దులోకి వేరొక గూడెం వారు రారు. చెంచుల ఆరాధ్య దైవాలు: చెంచులు వారి సొంత దేవుళ్ళతో పాటుగా నరసింహస్వామి మరియు భ్రమరాంబ,మల్లికార్జున స్వాములను ఆరాధ్య దైవాలుగా కొలుస్తారు.నరసింహ స్వామి సతీమణి అయిన చెంచు లక్ష్మి వీరి తెగకు చెందినదిగా చెప్పుకుంటారు.దీనికి ఆధారం అహెూబిలం దేవాలయ కుడ్యాల మీద చెక్కబడిన ప్రతిమలు మరియు శ్రీశైల దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో చెంచుల పాత్ర. చెంచులు దర్శించే ముఖ్యమైన యాత్రా స్థలాలు : 1.శ్రీశైలం. 2.మహానంది. 3.అహెూబిలం. చెంచుల ఆచారవ్యవహారాలు: వివాహ కార్యక్రమాలు: చెంచుల వివాహ నిశ్చయ కార్యక్రమం పెండ్లి కుమార్తె ఇంట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెండ్లి కుమారుడితో పాటుగా అతని తల్లిదండ్రులు, తొమ్మిది మంది పెద్దలు కన్యాదాత ఇంటికి వస్తారు.ఇరువర్గాలకు మరియు పెద్దలకు సమ్మతి అయిన తరువాత పెండ్లి నిశ్చయమైనట్లు ప్రకటించి అందరూ కలిసి సారాయి త్రాగుతారు.దీనితో పెండ్లి నిశ్చయ తంతు ముగుస్తుంది. చెంచుల పెండ్లి తంతు రెండురోజులు జరుగుతుంది. ముందురోజు పెండ్లి కుమారుని ఇంటి ముందు అడవి నుండి తెచ్చిన కట్టెలు, ఆకులూ మరియు పూలతో ఆకర్షణీయ పందిళ్ళు వేస్తారు.వధూవరులను ఒకే పందిరి క్రింద కూర్చుండబెడతారు.చెంచులలో నేటికీ కట్నాలు లేవు.పెండ్లి మెుదటిరోజు మరియు రెండో రోజు యాటను కోసి భోజనంతో పాటుగా ఒక్కొక్కరికి ఒక సీసా సారాయిని ఇస్తారు.చెంచు గూడెంలో తక్కువ కుటుంబాలు ఉన్నందున ఏ కుటుంబంలో పెండ్లి జరిగినా ఆ గూడెంలో ఉన్న మెుత్తం కుటుంబాలను పెండ్లికి పిలుస్తారు. వితంతు వివాహం: చెంచులలో భర్త చనిపోతే రెండో పెండ్లి చేసుకునే పద్దతి ఉంది.25 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీలు భర్త చనిపోయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెకు ఇష్టమైతే రెండో పెళ్ళి చేసుకోవచ్చు. కుటుంబ వ్యవస్థ: చెంచుల కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఉండవు.వివాహం జరిగిన వెంటనే విడిగా కాపురం పెట్టుకుంటారు.చాలా కుటుంబాలలో వివాహానికి పూర్వమే మగవాడు ఒక గుడిసెను ఏర్పాటు చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.చెంచులు స్వేచ్ఛను కోరుకునే మనస్తత్వం కలవారు.స్త్రీలు నెలసరి వచ్చినపుడు వారు నివాసం ఉంటున్న గుడిసెకు దూరంగా ఉండే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు. కర్మకాండ: చెంచుగూడెంలో ఏ వ్యక్తి చనిపోయినా గూడెంలో ఉన్న మెుత్తం జనాభా ఆ రోజున చనిపోయినా వారి ఇంటికి వచ్చి దహన సంస్కారాలు జరిగే వరకూ ఉంటారు.చెంచు గూడెంలలో చనిపోయిన వారిని పూడ్చడం లేదా కాల్చడం వంటివి అడవిలో చేస్తుంటారు.దహనం చేసిన తర్వాత ఒక్కో గూడెంలో ఒక్కోలా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు కర్మకాండ నిర్వహిస్తారు. అన్నం,కూరలు,మాంసం,చుట్టలు,సారాయి, రొట్టెలు మెుదలైనవి పిండంతో పాటుగా పెడతారు.కర్మకాండను చనిపోయిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు నిర్వహిస్తాడు. గూడెం పెద్ద: ప్రతి చెంచు గూడెంకు ఒక పెద్ద మనిషి ఉంటాడు.ఇతడిని గూడెంలోని వారందరూ కలసి ఎన్నుకుంటారు.గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెం వారితో సత్సంబంధాలు నెరపడం వంటివి కూడా చేస్తుంటాడు.గూడెంలో ఏ విధమైన శుభ కార్యం జరిగినా ఆయన తప్పనిసరిగా హాజరై ఆశీర్వచనాలు అందజేస్తాడు.కర్మకాండలు జరిగినపుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. చెంచులు ఒకచోట స్థిరంగా ఉండరు.ఒక్కొక్క సీజన్ లో ఒక్కో చోటుకు మారతారు.ఇటువంటి సందర్భాల్లో ఒక గూడెం ఇంకొక చోటుకు మారాలంటే స్థల నిర్ణయం గూడెం పెద్ద చెప్పిన ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. |
Date | 20 December 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
Items portrayed in this file
depicts
20 December 2017
image/jpeg
b281f5c830762b2fee6a4ec1b5de01638ad7525d
1,339,399 byte
2,441 pixel
2,441 pixel
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:59, 20 December 2017 | 2,441 × 2,441 (1.28 MB) | Adbh266 | Uploaded using Android Commons app |
File usage
The following 2 pages use this file:
Global file usage
The following other wikis use this file:
- Usage on te.wikipedia.org